ప్రభుత్వంలో పవన్ ముద్ర ఎక్కడ..? ఎందుకు ఆయన అంటీముట్టనట్లున్నారు..?

-

తెలుగుదేశం పార్టీకి ఊపరిపోసి.. పొత్తుద్వారా ఊపిరి పోశారు జనసేనాని పవన్ కళ్యాణ్.. బిజేపీని టీడీపీని కలిపింది కూడా పవన్ కళ్యాణే.. కూటమి ప్రభుత్వం అదికారంలోకి రావడానికి పవన్ ఎన్నో త్యాగాలు చేశారు.. సీట్లు త్యాగం చేశారు.. నమ్ముకున్న వారికి కూడా టిక్కెట్లు ఇప్పించుకోలేక పోయారు..అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు..

ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ.. పెద్దగా ఎక్కడా పర్యటించిన సందర్బాలు లేవ్.. జనసేన అంతర్గత సమావేశాలు, తన స్వంత శాఖలకు చెందిన అధికారులతో సమీక్షలు తప్పా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడంలేదు.. ఎన్నికలకు ముందు అనేకసార్లు చంద్రబాబు వద్దకు తానే స్వయంగా వెళ్ళిన పవన్ ఇపుడు మాత్రం పెద్దగా కలవడం లేదు. టీడీపీ నేతలతో కూడా టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండటపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.. టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దౌర్జన్యాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది..

పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జోక్యం చేసుకోకపోవడం, మౌనంగా ఉండటంపై తెలుగు తమ్ముళ్లు కూడా ఆందోళనలో ఉన్నారట.. ఆయన ఎప్పుడు బరస్ట్ అవుతారో అన్న అనుమానాలను సైతం ఆ పార్టీ నేతలు వ్యక్త పరుస్తున్నారు.. పవన్ కళ్యాణ్‌ తన శాఖలో పట్టుకోసం పనిచేస్తున్నారా..? లేక నిజంగానే అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version