CM Revanth Reddy: వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తోంది

-

వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఐదు వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదని.. బురద రాజకీయాలకు స్వస్తిపలకాలున్నారు. ఒకాయన ఫామ్ హౌస్ లో ఉంటే.. ఇంకొక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తారు కానీ.. వరద బాధితులను పరామర్శించరా..? అని ప్రశ్నించారు. మూడు రోజులుగా తాను నిద్ర లేకుండా సమీక్ష నిర్వహిస్తున్నానన్నారు రేవంత్ రెడ్డి. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రానికి రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు రేవంత్. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించామని.. నష్టం పై ప్రాథమిక నివేదికలు తెప్పించుకున్నామన్నారు. మృతులకు ఐదు లక్షల పరిహారం ప్రకటించామని.. పంట నష్టం కింద ఎకరాకి పదివేల పరిహారం ఇస్తామన్నారు. ఇక వర్షాలు, వరదలు నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version