భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ మాజీ నెం.1 ర్యాంకర్ 34ఏళ్ల సైనా నెహ్వాల్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా రిటైర్మెంట్పై సైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆర్థరైటిస్‌తో బాధపడుతుందట. దీంతో ఈ ఏడాది చివరి నాటికి కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. ఈ మేరకు ‘హౌస్ ఆఫ్ గ్లోరీ’ పాడ్‌కాస్ట్‌లో తాజాగా పాల్గొన్న సైనా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
“నా మొకాలు అంతగా బాగాలేదు. కీళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 8-9 గంటలు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్రపంచలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడాలంటే 2 గంటల ప్రాక్టీస్ అస్సలు సరిపోదు. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. అది కాస్త బాధగానే ఉంటుంది. కానీ, క్రీడాకారుల కెరీర్ చాలా తక్కువ సమయమే కదా. నేను 9ఏళ్ల వయసున్నప్పుడు కెరీర్ ప్రారంభించాను. వచ్చే సంవత్సరానికి నాకు 35 ఏళ్లు వస్తాయి. సుదీర్ఘ కాలంపాటు నేను బ్యాడ్మింటన్ ఆడాను. నా కెరీర్లో సాధించిన దానిపట్ల ఎప్పుడు గర్వంగానే ఉంటా. ఈ ఏడాది చివరి నాటికి నా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటా” అని తెలిపింది సైనా నెహాల్.