5 రాష్ట్రాల ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి కోవిడ్ ,ఓమిక్రాన్ కారణంగా ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధిస్తూ వచ్చింది. తాజాగా ఈరోజు జరిగిన సమావేశంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 1000 మందితో బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు 500 మందితో ఇండోర్ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇంటి ర్యాలీకి ఇప్పటి వరకు 10 మందికే అనుమతి ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 20కి పెంచింది. కాగా పూర్తి స్థాయిలో ర్యాలీలు, రోడ్ షోలను ఫిబ్రవరి 11 వరకు నిషేధించింది. ఈ నిర్ణయాల వల్ల రాజకీయ పార్టీలకు ప్రచారంలో ఊరట కలిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మణిాపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటించిన ఈసీ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది. ఆ తరువాత దీన్ని 22 తేదీకి పొడగించింది. మళ్లీ సమావేశం అయిన ఈసీ ఈ నిషేధాన్ని ఈనెల 31 వరకు పొడగించింది. ఈరోజు తీసుకున్న నిర్ణయంతో నిషేధాన్ని కాస్త సడలించినట్లు అయింది.