బీజేపీకి మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన‌ ఆప్..!

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్… 62 గెలవగా… బీజేపీ 8 గెలుచుకుంది. బీజేపీ గతంలో కంటే 5 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలవగలిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకుని ఉత్సాహంలో ఉన్న ఆప్ ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు.

తొలుత మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేయనున్నట్లు తెలిపారు. సానుకూల జాతీయవాదంతో పార్టీని విస్తరించేందుకు ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేవిధంగా కేజ్రీవాల్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అలాగే ద్వేషం, విభజన రాజకీయం వంటి అంశాలతో బీజేపీ ప్రతికూల జాతీయవాదం అనుసరిస్తోందని.. కానీ ఆప్‌ మాత్రం ప్రేమ, గౌరవమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ సానుకూల జాతీయవాదాన్ని అనుసరిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version