ఎప్పుడో 2012 లో జరిగిన నిర్భయ అత్యాచార దోషులను ఇప్పటి వరకు ఉరి తీయలేదు. అసలు ఉరి తీస్తారో లేదో కూడా స్పష్టత రావడం లేదు. నిందితులు తమకు ఉన్న న్యాయ అవకాశాలను ఒక్కొక్కటిగా వాడుకుంటూ ఉరి శిక్షను వాయిదా వేస్తున్నారు. దీనితో మన చట్టాలపై కూడా ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. నేరం చేసిన వాడు ఏమీ ఆలోచించకుండా నేరం చేసినప్పుడు,
ఆ నేరం రుజువు అయినప్పుడు ఎందుకు చట్టాలు అమలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వారిని ఈ నెల 1 వారిని ఉరి తీయాల్సి ఉంది. అయినా సరే ఉరి శిక్ష అమలు జరగలేదు. ఇప్పుడు దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరణశిక్ష అప్పీల్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలకు రూపొందించింది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 6 నెలల్లో సంబంధిత కేసు విచారణ పూర్తిచేయాలని గడువు విధించింది. దీనితో ఉరి మరో ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వినయ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన ఆరోగ్యం బాగోలేనందున క్షమాభిక్ష ప్రసాదించాలని కోరగా, అతని ఆరోగ్యం అంతా బాగుందని అవసరం లేదని కోర్ట్ స్పష్టం చేసింది.