తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర ప్రాంతం కీలక నాయకుడు ఎమ్మెల్యే అచ్చన్నాయుడు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన ఈయన ఎప్పటినుండో ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ని చాలా దారుణంగా విమర్శించిన నేతగా అచ్చన్నాయుడు కి మంచి పేరు ఉంది.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన నాయకుడిగా అచ్చన్నాయుడు క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే విధేయుడిగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఉత్తరాంధ్రలో జగన్ తన పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న అచ్చన్నాయుడు పై రాజకీయ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి జంప్ అయ్యి …వైసీపీ పార్టీలోకి అచ్చన్నాయుడు వస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.