ఎడ్యుకేటెడ్ మంత్రి ఇదేంటి? బాబు ఫైర్..టీడీపీ అభ్యర్ధి ఫిక్స్.!

-

ఇప్పుడు రాజకీయాల్లో నాయకులు ఎలా ఉంటున్నారో చెప్పాల్సిన పని లేదు..ఆ పార్టీ అని లేదు..ఈ పార్టీ అని లేదు..ప్రత్యర్ధులని బూతులు తిట్టడం, అరాచకాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో నాయకులు దాదాపు ఇలాగే ఉన్నారు. ప్రధాన పార్టీల్లో నేతలు అదేవిధంగా దిగజారిపోయి తిట్టుకుంటున్నారు. అయితే అక్కడ కొందరు నేతలు కాస్త డిసెంట్ గానే ఉంటున్నారు. అలా డిసెంట్ గా ఉండేవారిలో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. వెల్ ఎడ్యుకేటెడ్ మంత్రి.

అలాగే రాజకీయ పరమైన విమర్శలు చేయాల్సి వస్తే…డిసెంట్ గానే ఉంటాయి. పెద్ద అగ్రెసివ్ గా ముందుకెళ్లారు. అలాంటి నాయకుడు ఇప్పుడు చొక్కా విప్పి మరీ తన సొంత స్థానం యర్రగొండపాలెంలో హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా చంద్రబాబు రోడ్ షో యర్రగొండపాలెంలో జరిగింది. ఈ క్రమంలో దళితులకు బాబు క్షమాపణ చెప్పాలని సురేష్ నిరసన అందుకున్నారు. అసలు ఇన్ని స్థానాల్లో తిరిగిన..బాబుకు పెద్దగా నిరసనలు ఎదురు కాలేదు..కానీ ఇప్పుడు వై. పాలెంలోనే జరిగిందంటే..దాని వెనుక రాజకీయ కోణం అర్ధం చేసుకోవచ్చు.

అప్పుడెప్పుడో బాబు..దళితులుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని అన్నారట..దానికి ఇప్పుడు నిరసన తెలియజేస్తున్నారు. అయితే అప్పుడు మంచి ఉద్దేశంతో దళితుల గురించి మాట్లాడారు..దానికి వైసీపీ వక్రభాష్యం చెప్పి రాజకీయం నడిపిస్తుంది. అదే క్రమంలో సురేష్ ముందుకెళ్లారు. అధికారంలో ఉన్నారు కాబట్టి…బాబు రోడ్ షో జరిగే రోడ్డుపైకి వైసీపీ శ్రేణులు వచ్చేశారు. పోలీసులు కూడా వైసీపీ శ్రేణులని ఏం అనడం లేదు గాని టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు బాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి చేశారు. దీంతో బాబు సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయమైంది.

ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. అసలు ప్రశాంతంగా ఉండేచోట అలజడి సృష్టించింది మంత్రి సురేష్ అని విమర్శలు వస్తున్నాయి. బాగా చదువుకున్న ఆయన కూడా ఇలా చేయడం ఏంటని న్యూట్రల్ ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి. ఇక సురేష్ తీరుపై బాబు కూడా ఫైర్ అయ్యారు. ఆదిమూలపు సురేష్‌, ఆయన అనుచరుల అవినీతి వ్యవహారాలన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెలికితీసి తగుచర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో దళితులు, చివరికి దళిత ఉద్యోగులను కూడా వైసీపీ ప్రభుత్వం బహిరంగంగా హత్యలు చేయిస్తుంటే నోరు మెదపలేని మంత్రి సురేష్‌.. దళిత పక్షపాతినని చెప్పుకోటానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు.

అయితే వైసీపీ వచ్చాక దళితులపై దాడులు జరిగాయి..హత్యలు జరిగాయి..ఆ విషయం ప్రజలకు తెలుసు. కానీ వాటిని మంత్రి సురేష్ పట్టించుకోకుండా ఎప్పుడో అంశాన్ని భుజాన వేసుకుని నిరసన పేరిట రాజకీయం చేయడం బాగోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక సురేష్ కు ధీటుగా చంద్రబాబు యర్రగొండపాలెం టి‌డి‌పి అభ్యర్ధిగా ఎరిక్షన్ బాబుని ప్రకటించారు. ఇక దమ్ముంటే జగన్ ని అడిగి సీటు తెచ్చుకోవాలని సురేష్‌కు ఛాలెంజ్ చేశారు. ఏదేమైనా తాజా పరిణామాలు మంత్రి సురేష్‌కు వ్యతిరేకంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version