పసలేని పిటిషన్లతో మా టైం వేస్ట్ చేయొద్దు : సుప్రీం కోర్టు

-

ఎవరు పడితే వాళ్లు న్యాయస్థానంలోకి వచ్చి ఎలాంటి పిటిషన్లు అయినా వేస్తారా అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పసలేని పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేయొద్దని వ్యాఖ్యానించింది.

ఇలాంటి పిటిషన్లు తాము అనుమతించలేమని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ హత్య కేసులో ఉరిశిక్షకు గురైన నారాయణ్‌ ఆప్టేది ‘కస్టోడియల్‌ హత్య’ అని, ఇందుకు గాను ఆయన బంధువుకు బహిరంగ క్షమాపణ చెప్పేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ‘అభినవ్‌ భారత్‌ కాంగ్రెస్‌’ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించింది. ఆ మొత్తాన్ని న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది. అభినవ్‌ భారత్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్‌ ఫడ్నీస్‌ ఈ పిటిషన్‌ వేశారు.

ఒక నిందితుడికి క్షమాభిక్ష ప్రసాదించడానికి అప్పట్లో ప్రత్యేక న్యాయమూర్తికి వీలు కల్పించిన బాంబే ప్రజాభద్రత చర్యల చట్టం రాజ్యాంగ చెల్లుబాటును కూడా ఆయన సవాల్‌ చేశారు. గాంధీ హత్య కేసు విచారణలో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను ‘ఇరికించడానికి’ దీన్ని ఉపయోగించారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version