ఫ్రెష్ ఫీల్ ని పొందుతున్న క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా..!

-

రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి సందడి చేసిన ఈమె ఊహలు గుసగుసలాడే చిత్రంతో పూర్తిస్థాయి హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. తాజాగా రాశి కన్నాకు హిందీ నుండి కూడా అవకాశం లభిస్తుంది. ఒకవైపు సౌత్ లో వరుసగా సినిమాలలో నటిస్తూనే హిందీలో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో రాశి ఖన్నా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుందని చెప్పాలి.

ప్రస్తుతం తమిళంలో కూడా రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె రెగ్యులర్గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లు స్కిన్ షో చేసినప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవ్వడం సహజమే కానీ ఇలా పూర్తిగా డ్రెస్ తో తన శరీరాన్ని కప్పుకొని ఉన్న ఫోటోలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రకృతిలో పరవశిస్తూ ఫ్రెష్ ఫీల్ ని పొందుతున్న ఒక ఫోటో నెట్టింట షేర్ చేసింది.

ఈ ఫోటోతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలే కాదు ఇలాంటి క్యూట్ ఫోటోలు కూడా భలే ఉన్నాయి అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రాశిఖన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎప్పుడూ గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేసే ఈమె ఇలా మొదటిసారి ఇంత అందమైన ఫోటో షేర్ చేయడంతో నేటిజెన్లు ఈమె అందానికి మరింత పరవశించిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version