ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. కాషాయ పార్టీ శ్రేణులు 7 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మిగతా 3 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు.
గతంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామా చేసిన కర్హల్ స్థానంతో పాటు, సిసామౌలో ఎస్పీ లీడింగులో కొనసాగుతోంది. ఇక 7 స్థానాల్లో బీజేపీ దాని మిత్రపక్షం ఆర్ఎల్డీ ముందంజలో కొనసాగుతున్నాయి. కాగా, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 37 స్థానాల్లో సొంతంగా గెలిచి దూకుడు మీదున్న సమాజ్ వాదీ పార్టీకి తాజాగా బైపోల్స్ ఫలితాలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ షాకిచ్చారు.