ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. SIB మాజీ చీఫ్, ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరు అయ్యింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న తన కుమారుడి అభ్యర్థన మేరకు గ్రీన్ కార్డు మంజూరు చేసారు. బ్లడ్ రిలేషన్ కేటగిరీ, అనారోగ్యం నేపథ్యంలో ప్రభాకర్​కు గ్రీన్ కార్డు మంజూరు చేసారు. అయితే తనకు గ్రీన్ కార్డు మంజూరు అయినట్లుగా ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు ఆయన.

అయితే అనారోగ్యం కారణంగా ప్రభాకర్ రావు అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదుకు ముందే అమెరికా టూర్ ప్లాన్ చేసుకున్నారు ప్రభాకర్ రావు . కేస్ నమోదు కాగానే కుమారుడు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ప్రారంభించాడని చెప్తున్నారు అధికారులు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ప్రభాకర్ కు గ్రీన్ కార్డు రావడం గమనార్హం. ఇక గ్రీన్ కార్డు వచ్చినప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అంటున్న అధికారులు.. స్థానిక చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news