బాబు కోర్టులో పవన్ బంతి..జగన్‌కే మేలు.!

-

ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి టి‌డి‌పి-జనేసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వేదికగా పవన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్‌డి‌ఏ సమావేశానికి ఢిల్లీకి వెళ్ళిన ఆయన..ఏపీ లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మూడు పార్టీలు కలవాలని అన్నారు. అయితే బి‌జే‌పి-జనసేన కలిసే ఉంటాయని…ఇంకా తమతో కలవాలా? వద్దా? అనేది టి‌డి‌పి ఆలోచించుకోవాలని, అలాగే ఎన్నికల్లో గెలిచిన బలాబలాలని బట్టి సి‌ఎం ఎంపిక చేస్తామని అన్నారు. ఇక తనకు సి‌ఎం పదవి ముఖ్యం కాదని, అరాచక పాలన చేస్తున్న వైసీపీని గద్దె దించడమే ప్రధానమని అన్నారు.

అయితే పొత్తుపై పవన్ తేల్చేసి..బంతి చంద్రబాబు కోర్టులో పెట్టారు. ఇప్పుడు పొత్తుపై తేల్చుకోవాల్సిందే చంద్రబాబు మాత్రమే. జనసేన-బి‌జే‌పితో కలవాలా? లేక ఒంటరిగా వెళ్లాలా? అనేది ఆయనే నిర్ణయించుకోవాలి. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పవన్ చెప్పడానికి మూడు పార్టీలు కలుస్తాయని అంటున్నారు..కానీ బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు రెడీగా లేదు. అప్పుడు పవన్ మొదట బి‌జే‌పిని ఒప్పించాలి.

అదే సమయంలో బి‌జే‌పితో కలిసి వెళితే టి‌డి‌పికే నష్టమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే బి‌జే‌పి ఏపీకి న్యాయం చేయలేదని, పైగా ఆ పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా లేవని, అలాంటప్పుడు బి‌జే‌పితో కలిస్తే ఆ యాంటీ టి‌డి‌పిపై పడుతుందని, అప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీకి లాభం జరుగుతుందని అంటున్నారు.

కాబట్టి పొత్తులపై ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అలా అని బి‌జే‌పి తమకు శత్రువు కాదని, అలాగే మిత్రపక్షం కాదని తమ్ముళ్ళు అంటున్నారు. ఇక రాష్ట్రంలో బలంగా ఉన్న టి‌డి‌పికి 40 శాతం ఓటు బ్యాంక్ ఉందని, కూటమి కడితే..అతి పెద్ద పార్టీ టి‌డి‌పి అవుతుందని, అలాంటప్పుడు సి‌ఎం సీటు విషయంలో చర్చ అనేది ఉండదని అంటున్నారు. మరి చూడాలి చివరికి ఈ పోటు ఎటువైపు వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version