ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యూహన్ ల్యాబ్ నుండి కావాలని చైనా ప్రపంచం మీదికి వదిలింది అని చాలామంది అంటున్నారు. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాలో ఇన్వెస్టిగేషన్ చేయటానికి పరిశోధనలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచంలో అనేక మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ ని చైనా ప్రభుత్వం వ్యూహన్ ల్యాబ్ లో దాచిపెట్టి ప్రపంచం మీదకి రిలీజ్ చేసిందని అనేక దేశాల అధినేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ముప్పై మూడు పేజీల పిటిషన్ ను దాఖలు చేసినట్టు సమాచారం. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కొన్ని కోట్లు నష్టపోతున్నాయి. మందులేని ఈ వైరస్ వల్ల ప్రజలు చనిపోతున్న తరుణంలో లాక్ డౌన్ విధిస్తూ తీవ్రంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా దేశాలు కరోనా వైరస్ వల్ల బాగా నష్టపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ లాయర్ చేసిన పని చేయడానికి… యూరప్ దేశాలు మరియు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ దేశాల లాయర్లు కూడా సిద్ధమవుతున్నట్లు చైనాపై కేసు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.