టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై?.. త్వరలో వైసీపీలోకి..!

-

అమరావతి: టీడీపీకి అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పనున్నారా? విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వలసల జోరు పెరిగింది. ముఖ్యంగా వైసీపీలోకి నాయకులు చేరుతున్నారు. ఇవాళే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడారు.

అంతలోనే అనకాపల్లి ఎంపీ కూడా టీడీపీని వీడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి చెందిన చాలామంది నేతలు తమ అనుచరులతో కలిసి రహస్య మంతనాలు జరుపుతున్నారు. తమ భవిష్యత్ కార్యచరణను ఖరారు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ జగనే గెలవనున్నట్టు తెలుస్తుండగా… టీడీపీలో ఉండటం వల్ల లాభం ఉండదని టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవంతి కూడా టీడీపీని వీడి త్వరలోనే వైసీపీలో చేరునున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర రాజకీయాలు వైజాగ్ కేంద్రంగా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆ మార్పులు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది టీడీపీ నేతలు టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఇవన్నీ వదంతులా లేక నిజాలా అంటే.. దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే.. ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీని వీడడు అని వార్తలు వచ్చాయి కానీ.. చివరకు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు.

అవంతి శ్రీనివాస్ ఎందుకు టీడీపీని వీడుతున్నారంటే?

ఈసారి అనకాపల్లి లోక్‌సభ టికెట్ తనకు వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశంతోనే అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి వెళ్లబోతున్నట్టు చెబుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అవంతికి బదులుగా.. అనకాపల్లి ఎంపీ సీటును కొణతల రామకృష్ణ లేదా దాడి వీరభద్రరావు ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇస్తారంటూ రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా శ్రీనివాస్ తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే.. పార్టీ హైకమాండ్ నుంచి ఎంపీ సీటుపై అవంతికి ఎటువంటి స్పందన రాలేదట. దీంతో టీడీపీకి రాజీనామా చేయాలని అవంతి యోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version