అజయ్ దేవగన్ విలన్ కాదు.. మరేంటో..!

-

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ ను విలన్ గా రాజమౌళి ఒప్పించాడని టాక్.

అజయ్ దేవగన్ ఆర్.ఆర్.ఆర్ లో ఉండేది నిజమే కాని విలన్ రోల్ మాత్రం కాదట. విలన్ గా ఎవరు చేస్తారో తెలియదు కాని ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ కెమియో రోల్ మాత్రమే అని అంటున్నారు. ఓ గొప్ప సినిమాలో భాగమయ్యేందుకు అజయ్ కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సృష్టించలేని రికార్డులను అందుకున్న రాజమౌళి ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఓ యజ్ఞంలా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version