వైఎస్సార్సీపీలో చేరిన యాంకర్ శ్యామల, ఆమె భర్త..

-

ఇప్పటికే టీడీపీకి దెబ్బల మీద దెబ్బలు తగలడం చూస్తూనే ఉన్నాం. టీడీపీకి తగిలిన దెబ్బలు మామూలువి కావు. ఆ దెబ్బలతో ఒక్కసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది.

వారి దేవుడోయ్… ఇవేం వలసలురా బాబోయ్. అటు ఎండ వేడిని తట్టుకోవాలా? ఇటు రాజకీయ వేడిని తట్టుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు.. అంటూ తల పట్టుకొని కూర్చున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు.. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా… రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎంతలా అంటే… క్షణ క్షణం ఏం జరుగుతుందో తెలియనంతగా… అటు చూసి ఇటు చూసే లోపు రాజకీయాలు మారిపోతున్నాయి. అందుకే ఏపీ ప్రజలు కూడా ఏం జరుగుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే టీడీపీకి దెబ్బల మీద దెబ్బలు తగలడం చూస్తూనే ఉన్నాం. టీడీపీకి తగిలిన దెబ్బలు మామూలువి కావు. ఆ దెబ్బలతో ఒక్కసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది. కోలుకోలేని దెబ్బ అది. వార్ వన్ సైడే అన్నట్టుగా టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అంతా వైసీపీ బాట పట్టారు.

ఆమెకు తోడుగా అలీ, జయసుధ, రాజా రవీంద్ర, మోహన్ బాబు.. లాంటి వాళ్లు వైసీపీలో చేరారు. ఇవాళే జీవిత, రాజశేఖర్ కూడా చేరారు. వాళ్లతో పాటు ఫేమస్ తెలుగు యాంకర్ శ్యామల, ఆమె భర్త నర్సింహరెడ్డి, నటి హేమ కూడా వైసీపీలో చేరారు. అది సంగతి. ఈ సందర్భంగా వారందరికీ వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.అంతటితో వలసలు ఆగాయా? లేదు.. సినీ గ్లామర్ కూడా వైసీపీకి తోడయింది. ఎంతలా అంటే… ఇప్పటికే రోజా.. వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే.



Read more RELATED
Recommended to you

Exit mobile version