కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పోరాడుతున్నాయి. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మార్గం నియంత్రణ చేపట్టడం తో లాక్ డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తొలి దశ లాక్ డౌన్ లో కరోనా వైరస్ కంట్రోల్ కాకపోవటంతో మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం మనకందరికీ తెలిసిన విషయమే.
అయినా కానీ పారిశ్రామిక భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఇల్లు వదలి బయటకు రావటం లేదు. కరోనా అంటే భయం , పని చేసుకోవడానికి అవకాశాలు దొరక్క ఇంటికే పరిమితమవుతున్నారు .దీనికి తోడు పోలీసు బందోబస్తీ ఎటు వెళ్తే ఏమవుతుందోని జనం రోడ్డెక్కడానికి జంకుతన్నారు. ఈ పరిస్థితులు ఇప్పట్లో మారవు