గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి

-

గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యరంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటిగంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుని పైలట్ ప్రయోగంగా ఈ సెప్టెంబరులో ప్రారంభించనున్నారు. దీనికోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు.

మారుతున్న జీవన ప్రమాణాలు చిన్నవయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు సంభవించిన తొలి గంటలోపే (దీన్నే గోల్డెన్ అవర్ అంటారు) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యధిక అవకాశాలున్నాయి. అనారోగ్యానికి గురైన వెంటనే గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తించడం, సమీపంలో ఉన్న ఆసుపత్రికి సకాలంలో చేర్చడం, …… ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రోగిని తరలించి, ECG వంటి పరీక్షల ద్వారా రోగి పరిస్థితిని అంచనావేసి, అవసరమైన శస్త్ర చికిత్సను చేయడం అనేవి చాలా ముఖ్యం. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే గుండెపోటు కారణంగా జరిగే మరణాలను కట్టడి చేయగలం. ఇందుకోసమే ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది.

గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయాన్ని సద్వినియోగం చేస్తూ రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యం.
ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న PHCలలో ఇనీషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ను ఉచితంగా రోగికి అందించడం, తదనంతరం 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్ కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్స నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగం. ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేసింది.STEMI పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29, 2023న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే గుండె సంబంధిత మరణాలను తగ్గించవచ్చు. ఈ మేరకు ప్రజారోగ్యంపై దృష్టిపెట్టింది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news