ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ రంగం సిద్ధమవుతోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారబోతోంది. అంటే ఇప్పుడున్న 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతాయి. ఈ నెల 15న జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా తాము అధికారంలోకి రాగానే జిల్లాల విభజన జరుగుతుందని సీఎం జగన్ తేల్చి చెప్పేశారు.
ఇకపోతే గత నెల 11న జరిగిన భేటీలో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది.