ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ పథకంకు నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
దానికి అనుగుణంగా ఇబ్బందులు లేకుండా రైతుల అకౌంట్లో ముందుగానే నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు మంత్రి. ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత విద్యుత్ కొనసాగుతుందని స్పష్టం చేసారు. రైతులు బిల్లులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన. వచ్చే ఆర్ధిక ఏడాది నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.