ఏపీలో హాట్ సీట్లలో కుప్పం, పులివెందుల, మంగళగిరి, భీమవరం సీట్లు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో పార్టీ అధినేతలు బరిలో ఉంటున్నారు. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ పోటీ చేయడం ఖాయం. అయితే ఎవరికి వారు ఓడించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. టిడిపి అధికారంలో ఉండగా పులివెందులలో జగన్‌ని ఓడిస్తామని టిడిపి నేతలు సవాల్ చేశారు..కానీ గతం కంటే భారీ మెజారిటీతో జగన్ గెలిచారు.
అలాగే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని వైసీపీ అంటుంది. లోకల్ ఎన్నికలని గెలుచుకుంది. కానీ కుప్పంలో బాబుని ఓడించడం ఈజీ కాదు. ఇప్పటికీ అక్కడ బాబుకే ప్లస్ ఉంది. కాబట్టి మళ్ళీ ఆయన గెలవడం సులువే. ఇటు టిడిపి పులివెందులని టార్గెట్ చేసింది…కానీ జగన్ మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలిచేస్తారు. ఇక పవన్, లోకేష్ గురించి మాట్లాడుకోవాలి.
గత ఎన్నికల్లో ఇద్దరు తొలిసారి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. టిడిపి నుంచి మంగళగిరి బరిలో దిగి తక్కువ మెజారిటీతోనే లోకేష్ ఓడిపోయారు. అటు పవన్..జనసేన నుంచి భీమవరం, గాజువాకలో పోటీ పోటీ ఓడిపోయారు.
అలా ఓడించి..ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేదని వైసీపీ నేతలు ఇప్పటికీ ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో గెలవాలనే కసితో ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు. మళ్ళీ లోకేష్ మంగళగిరి బరిలో పోటీ చేస్తున్నారు. ఈ సారి అక్కడ లోకేష్ విజయానికి అవకాశాలు ఉన్నాయి. జనసేనతో పొత్తు ఉన్నా, లేకపోయినా లోకేష్ గెలిచేలా ఉన్నారు.
ఇటు పవన్..ఈ సారి భీమవరం బరిలో ఉండటం ఖాయం..అలాగే అక్కడ టిడిపితో పొత్తు లేకపోయినా సరే పవన్ గెలుపు ఖాయమని తెలుస్తుంది. మొత్తానికైతే బాబు, జగన్, పవన్, లోకేష్ తమ తమ నియోజకవర్గాల్లో సత్తా చాటనున్నారు.