నూకలు తినాలని పియూష్ గోయల్ అనలేదు… కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయమే ఇదంతా: బండి సంజయ్

-

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కారం కావాలని  సీఎం కేసీఆర్ కు లేదని… ఇన్నేళ్లు ఏ రాష్ట్రంలోని సమస్య తెలంగాణ లోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రుల టీమ్ పీయూష్ గోయల్ ని కలిశారని… కుట్రలు చేయడంతో, అబద్ధాలు ఆడటంతో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. ప్రగతి భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్ ను పంపిస్తే గానీ మంత్రులు మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. పీయూష్ గోయల్ నూకలు తినాలని అనలేదని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి లాగా… పీయూష్ గోయల్ సంస్కారం లేని వ్యక్తి కాదని బండి సంజయ్ అన్నారు. అనని మాటలను డ్రామాలు ఆడి తెలంగాణ సెంటిమెంట్లు రగిల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమే అని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారో రైతులకు పూర్తిగా తెలుసు అని.. ఏడేళ్లుగా కేసీఆర్ మాటలు నమ్మారని.. ఇన్నాళ్లు ధాన్యాన్ని నేనే కొంటున్నా అని చెప్పిన ఆయన బాగోతం బయటపడిందని విమర్శించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని ఒప్పందం చేసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version