నిరుద్యోగుల మిలియన్ మార్చ్ ప్లాన్ కేసీఆర్ కు భయం పుట్టించింది: బండి సంజయ్

-

బీజేపీ నిరుద్యోగుల మిలియన్ మార్చ్ ప్లాన్ సీఎం కేసీఆర్ కు భయం పుట్టించిందని… బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగులను మరోసారి సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. 2014లో ఇదే అసెంబ్లీలో సీఎం కేేసీఆర్ లక్షా 7 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు… ఇంటికో ఉద్యోగం అన్నాడు.. బిశ్వాల్ కమిటీ 1.91 వేల ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించిందని.. చివరకు 80 వేల ఉద్యోగాలకు లెక్క వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. మిగతా లక్ష ఉద్యోగాలు ఎవరు ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా ఇదే మాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రాన్ని తిట్టడం సీఎం కేసీఆర్ కు ఆనవాయితీ అయిందన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని బండి సంజయ్ అన్నారు. కొత్త జోనల్ విధానానికి 2018లో రాష్ట్ర పతి ఆమోదించారు..అప్పటి నుంచి కేసీఆర్ ఏం చేశారు..? అని ప్రశ్నించారు. ఏ ముహూర్తాన సీఎం అయ్యావో కానీ.. తెలంగాణకు శనిలా దాపురించావని విమర్శించారు. 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 12 వేల మంది విద్యావాలంటరీలను తొలగించావని, 22 వేల మంది స్కావేంజర్లను, 17 వేల మంది స్టాఫ్ నర్సులను తొలగించావని.. కోవిడ్ సమయంలో మీ కుటుంబం అంతా ఇంట్లో పంటే… వారంతా సేవ చేశారని బండి సంజయ్ అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version