మ్యానేజ్ చేయడంలో చంద్రబాబుకి సాటి లేదని మరోసారి నిరూపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబులోని అసలు వ్యక్తిత్వం బయటకు వస్తోంది. ఇన్నాళ్లూ ఎలాగోలా మ్యానేజ్ చేసుకొస్తూ వచ్చినా ఇప్పుడు తన అసలురూపాన్ని బయటపెట్టారు. ఢిల్లీలో తనకోసం లాబీయింగ్ చేయనివారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.తనమీద ఉన్న అవినీతి కేసుల విషయంలో ఢిల్లీ స్థాయి నాయకులూ.. అక్కడి పెద్దలతో తన తరఫున రాయబారాలు చేయడం.. చీకటి వ్యవహారాలు చేయడం వంటి పనులు చేయని కారణంగా తనలోని రాక్షసరూపాన్ని బయటపెడుతున్నారు.
అలా చంద్రబాబు స్వార్థానికి బలైన మరో నేత కేశినేని నాని. రెండుసార్లు గెలిచినప్పటికీ కేశినేని నానిని పార్టీనుంచి బయటకు పంపేసినంత పని చేశారు చంద్రబాబు. పార్టీలో ఉండాలి కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం జేసుకోవద్దు.. పెద్దరికం చూపొద్దు.. ఉండీ లేనట్లు అలా పడి ఉండాలి అంటూ రాయబారం పంపడం చంద్రబాబుకే చెల్లింది. దీంతో కేశినేని తన దారి తాన చూసుకుంటున్నారు.
జనవరి ఏడోతేదీన తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు నాని బదులు ఆయన తమ్ముడు చిన్నిని ఇంచార్జి గా నియమించారు. చంద్రబాబు సభ ఏర్పాట్లు చర్చించే నిమిత్తం చిన్ని, నాని వర్గీయులు తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఇరువర్గాల వారు తెగ కొట్టేసుకున్నారు.నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది.
ఒక దశలో దేవదాస్ మీద దాడికి యత్నించగా స్థానిక నేతలు ఆయన్ను కాపాడారు. ఆ తరువాత అక్కడికి వచ్చిన చిన్నిని సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు. తరువాత ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ గందరగోళం సృష్టించారు.ఈ సంఘటన అనంతరం కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్ నియమించింది.
ఇన్‌చార్జ్‌ని మార్చిన టీడీపీ హైకమాండ్…, తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని కేశినేని నిచంద్రబాబు ఆదేశించారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపట్ల నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు.. తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంటుగా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. గత కొన్నాళ్లుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్నా బోండా ఉమా వంటివాళ్ళు నానిని విజయవాడలో విమర్శిస్తూ… వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధిబృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్ళింది. ఇదే విషయాన్నీ అయన ఫెసుబుక్కులో సైతం స్పష్టం చేసారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాణ్ణని అంటూ అయన చంద్రబాబుకే డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.టీడీపీకి త్వరలో రాజీనామా చేస్తానని కూడా స్పష్టం చేశారు. నాని రాజీనామా ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రబాబుని రంగంలోకి దింపారు చంద్రబాబు.
విజయవాడలోని నాని ఇంటికి కనకమేడల చేరుకున్నారు.గంటకు పైగా నానితో చర్చలు జరిపారు ఎంపీ కనకమేడల.నానికి నచ్చజెప్పడానికి కనకమేడల వచ్చారా లేదా ఓదార్చడానికి వచ్చారా అనేది తెలియరాలేదు. ఎంపీ కేశినేని కి చెక్ పెట్టినట్లే తనకు కూడా చంద్రబాబు ప్రాధాన్యతను తగ్గిస్తారా అనే భయం ఇప్పుడు కనకమేడలకు కూడా పట్టుకుంది అంటున్నారు జనాలు.అక్కడుంది వెన్నుపోటు పొడిచే చంద్రబాబు మరి. ఆమాత్రం భయం ఉండాల్సిందేనని అంటున్నారు బెజవాడ జనాలు. ఇక కనకమేడల చెప్పే స్టేట్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.