రేవంత్ రెడ్డి ఓకే…బండికి అది సాధ్యమేనా?

-

సాధారణంగా జాతీయ పార్టీల్లో ఏకనాయకత్వం సాధ్యం కాదు. రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఉంటారుగానీ, వారికి పూర్తిగా పార్టీ మీద గ్రిప్ ఉండదు. ఇప్పటివరకు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల్లో అదే పరిస్తితి ఉంది. అయితే గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న వైఎస్సార్‌కు మాత్రం ఆ ఛాన్స్ దక్కింది. పార్టీని మాత్రం ఆయన తన గ్రిప్‌లో పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఉండేవిధంగానే అప్పుడు కాంగ్రెస్‌లో వైఎస్సార్ వన్ మ్యాన్ షో నడిచింది.

రేవంత్ రెడ్డి/ revanth reddy

ఇక వైఎస్సార్ ముందుగానీ, ఆ తర్వాత గానీ కాంగ్రెస్‌లో ఆ సీన్ రిపీట్ కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు దక్కిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డికి తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ పార్టీలో ఏ సీనియర్ నాయకుడుకు లేని విధంగా రేవంత్‌కు క్రేజ్ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఆయన చెప్పినట్లుగానే కాంగ్రెస్ ముందుకెళుతుందని చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో నడవడం ఖాయంగా కనిపిస్తోంది.

అలాగే వైఎస్సార్ మాదిరిగా పార్టీని తన గ్రిప్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారు. అయితే రేవంత్‌కు సాధ్యమైనట్లు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సాధ్యమవుతుందా? అంటే చెప్పడం కష్టం. ఆయన కూడా అధ్యక్షుడుగా దూకుడుగా ఉన్నారు.

కానీ బీజేపీలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ల హవా ఉంది. అయితే బండి కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. పాదయాత్ర చేసిన బీజేపీలో బండి షో మాత్రం ఉండదని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఏం చెబితే అదే జరుగుతుంది. అంటే రేవంత్ మాదిరిగా బీజేపీలో బండి వన్ మ్యాన్ షో నడవటం కష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version