మిషన్-19: కమలం సక్సెస్ అవ్వడం కష్టమేనా?

-

మిషన్-19…తెలంగాణలో బీజేపీ చేపట్టిన కొత్త కార్యక్రమం..టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడే చెక్ పెట్టాలని చూస్తున్న కమలం పార్టీ ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్‌కు ధీటుగా పనిచేస్తున్న కమలం పార్టీ..ఇంకా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి ఇంకా దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో మరింత బలం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి పెద్ద బలం లేని విషయం తెలిసిందే…కొన్ని స్థానాల్లో బీజేపీకి బలం కనిపిస్తుంది గాని..కొన్ని చోట్ల మాత్రం పార్టీకి పట్టు లేదు. అందుకే మరింత బలం పెంచాలనే దిశగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఏ మాత్రం బలం లేని ఎస్సీ, ఎస్టీ స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. సాధారణంగానే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బీజేపీకి అంత బలం లేదు.

ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు పెద్దగా మొగ్గు చూపారు. కానీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఈ స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్తితి. అందుకే బండి సంజయ్ ఈ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో 19 ఎస్సీ స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి మిషన్-19 అనే కార్యక్రమం చేపట్టారు.

దళితులకిచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం అమలు చేయడంపై ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ పోరాటాలు చేయనుంది. అదే సమయంలో దళిత, గిరిజన, బీసీల పట్ల బీజేపీ సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మిషన్‌-19 పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎస్సీ స్థానాల్లో బీజేపీ పికప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు బలం ఎక్కువ ఉంది. కాబట్టి వారిని దాటి బీజేపీ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version