ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. ప్రలోభాలలో భాగంగా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారట.
ఎలాంటి అనుమతులు లేకుండా విందు జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులకు గురువారం, రాత్రి 11 గంటలకు సమాచారం అందింది. ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో అది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు ఎక్సైజ్ అధికారులు. తమకు ఈ విషయం తెలియదని.. వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చామంటున్నారు ఉద్యోగులు. దింతో ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యాడు.