తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని.. మేము సాధించుకున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాలు జరుపుతున్నారు. దాన్ని ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ విజయాన్ని నిర్దేశించిన రోజు అంటూ.. ఆనాటి కేసీఆర్ ఫోటోలను పోస్ట్ చేశారు.
‘ఈ రోజు డూ ఆర్ డై పోరు రాజుకొని, తెలంగాణ ఖాయమైన రోజు అని, 15 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు’ అని తెలిపారు. అలాగే అతని ఉక్కు సంకల్పం దేశం యొక్క రాజకీయ స్థాపనకు ఒత్తిడి చేసిందని అన్నారు. తెలంగాణ ఇవ్వలేదు, కాంగ్రెస్‌పై సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం ద్వారా సాధించబడిందన్నారు.ఇక ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిచ్చే మీ నాయకత్వానికి ధన్యవాదాలు కేసీఆర్ సార్..రాబోయే అనేక తరాల వరకు ఇది అలాగే కొనసాగుతుందని రాసుకొచ్చారు.