ఆదిలాబాద్ పై కన్నేసిన కమలం..కీలక కాంగ్రెస్ నేతలకు గాలం

-

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల పై కమలం పార్టీ కన్నేసింది. ఇప్పటికే జిల్లాలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ లో పేరుమోసిన లీడర్లను పార్టీలోకి తీసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారంట బీజేపీ నేతలు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట..కోటకు ఎప్పుడో బీటలు వారగా ఇప్పుడు ఉన్న లీడర్లు సైతం పక్క చూపులు చూస్తున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న నాయకులను వారి స్థాయిని భట్టి బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు జాతీయ స్థాయి నేతలు పార్టీలోకి ఆహ్వనిస్తున్నట్లు తెలుస్తుంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి,నారాయణ రావ్ పటేల్ ,మోహన్ రావ్ పటేతోపాటు ఆయా నియోజకవర్గాల్లోని కీలకంగా ఉన్న నాయకులకు కమలం పార్టీ కండువా వేసేందుకు మంతనాలు ప్రారంభించిందంటా బిజెపీ పార్టీ…మరి ముఖ్యంగామహేశ్వర్ రెడ్డి కోసం జాతీయ స్థాయి నాయకత్వం రంగంలోకి దిగిందనే టాక్ వైరల్ గా మారుతోంది.. నిర్మల్ జిల్లా కు చెందిన ఏలేటీ మహశ్వర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముఖగా ఉన్నాడు..పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన జిల్లాలో పార్టీని నడిపించడంలో కీరోల్ పోషిస్తున్నాడు.

మహేశ్వర్ రెడ్డికి తన నియోజకవర్గంలో బలమైన నేత ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా ఉన్నారు..సామాజికవర్గం సపోర్ట్ తోపాటు ఎప్పుడైనా.. ఏపార్టీలోఉన్నా పోటీ మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి వర్సెస్ మహేశ్వర్ రెడ్డిగానే సాగుతోంది..ఈక్రమంలో పోయిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి పై ఓటమి పాలయ్యారు. స్వల్పమెజార్టీతో ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు..ఇక్కడ గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది..అయితే అప్పటి నుంచి మహేశ్వర్ రెడ్డి తన క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు..ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మహేశ్వర్ రెడ్డికోసం బిజెపీ పార్టీ గట్టిగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ ఈ విషయంలో చొరవ తీసుకున్నారట. గ్రేటర్ ఎన్నికల తర్వాత మహేశ్వర్ రెడ్డితోపాటు జిల్లాలోని నియోజకవర్గాలనుంచి ఏడుగురు కీలక నాయకులు పార్టీ మారతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది.

నియోజకవర్గాల వారిగా చూస్తే నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి,ముథోల్ లో మోహన్ రావ్ పటేల్ ,నాయారాయణ రావ్ పటేల్ ,ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ ,అండ్ ఫ్యామీలీ,అలాగే అలాగే బోథ్ నియోజకవర్గంలోని ఇద్దరు ముగ్గురు నాయకులతో బిజెపి నేతలు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎంపీగా సోయం బాపురావ్ గెలవడం ,దుబ్బాకలో సైతం అధికార పార్టీని కాదని బిజెపి అభ్యర్థి గెలవడం పార్టీలో చేరే అంశంపై క్యాడర్ తో కాంగ్రెస్ నేతలు చర్చించినట్టుగా చర్చ జరగుతుంది..

జిల్లాలో పూర్తిస్థాయిలో పట్టు సాధించాలంటే ముందుగా కాంగ్రెస్ ను ఖాళీ చేసి ఆ స్థానాన్ని తాను భర్తీ చేయాలని చూస్తుంది కమల దళం.

Read more RELATED
Recommended to you

Exit mobile version