బీజేపీ బైట్ : మాట వేగ‌మే త‌ప్ప మ‌నిషి వేగం లేదా ? అదిగో “బండి”

-

రెండంటే రెండు జాతీయ పార్టీలు ఉనికిని నిలుపుకునేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్నాయి.ఈ క్ర‌మంలో ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నాయి. ఆ విధంగా ఈ సారి ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలం కావాల‌ని చూస్తున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ ఇప్ప‌టికే పోరు ఆరంభించి జోరు పెంచింది. ఇదే విధంగా బీజేపీ కూడా శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది. పార్టీ అధిష్టానం పిలుపు మేర‌కు సార‌థ్య బాధ్య‌త‌ల్లో ఉన్న బండి సంజ‌య్ బాగానే ప‌నిచేస్తున్నారా? అంటే ప‌ర్లేదు అన్న వాద‌నే వినిపిస్తోంది.

ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియ‌న్ గా కొన్ని సార్లు ఉన్నారా ? అంటే ఔన‌న్న స‌మాధానం కూడా వినిపిస్తోంది. తెలంగాణలో ప‌రువు నిలుపుకునేందుకు ఛార్మింగ్ ఉన్న నేత‌లు బీజేపీకి కావాలి. కానీ ఇక్క‌డ ఈట‌ల లాంటి లీడ‌ర్లు ఉన్నారు కానీ వారికి ప్రాధాన్యం లేదు. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లంటూ హ‌డావుడి చేసినా ఆయ‌న మాస్ లీడ‌ర్ కాదు. మ‌తం పేరిట వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా అవ‌న్నీ మీడియా లో క‌నిపించేందుకు పడే ఆరాటంలో భాగంగానే చూడాలి త‌ప్ప వాటికి పెద్ద‌గా ఓట్లు రాల‌వు.

ఈ ద‌శలో ఉచిత విద్యుత్ పై ఇంకా ఇత‌ర విష‌యాలపై బండి సంజ‌య్ స్పందించారు. ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ మహా దోపిడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ కోసం ప్రత్యేక సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారన్నారు. 40 గ్రామాలకు అవసరమైన కరెంట్‌ను ఉచితంగా వాడుకుంటున్న ఘనుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.

వాస్త‌వానికి వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ పై కేంద్రం ఎప్పటి నుంచో మోకాల‌డ్డుతోంది. ఈ విష‌య‌మై రాష్ట్రాల‌ను అడ్డుకుని ఏమైనా చేయాలి అనుకున్న విధంగా చేయాలేక‌పోతోంది. ఫ‌లితం గా ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రంలో బీజేపీ స‌ర్కారు న‌వ్వుల పాలవు తోంది. ఉచిత విద్యుత్ లేకుంటే సేద్యానికి ప్ర‌భుత్వం త‌రఫున క్షేత్ర స్థాయిలో క‌నీస మ‌ద్ద‌తు ద‌క్క‌దు. ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ ప‌థ‌కం మంచిదే ! ఈ ప‌థ‌కంలో భాగంగా విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటు అన్న‌ది త‌ప్పు అని కేసీఆర్ పోరాడుతున్నారు. తాము వ‌చ్చాక వ్య‌వ‌సాయం స‌స్య‌శ్యామ‌లం అయింద‌ని అంటున్నారు. మ‌రి! కేసీఆర్ మాత్ర‌మే ఉచిత విద్యుత్ వాడుకుంటే ఇంత‌కాలం బీజేపీ ఏం చేస్తుంద‌ని?

Read more RELATED
Recommended to you

Exit mobile version