ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన సోనాలి బింద్రే

-

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతానికి దర్శకనిర్మాతలు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో కీలకపాత్రలో సోనాలి బింద్రే నటించబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ చిత్రం తో సోనాలి బింద్రే తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ న్యూస్ పై సోనాలి బింద్రే తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ చిత్రంలో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె షాక్ అయ్యారు. సోనాలి మాట్లాడుతూ..” నో నాకు దీని గురించి అసలు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.” ఇది ఫేక్ న్యూస్ అంటూ సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చింది. దీని గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదని సోనాలి బింద్రే తెలిపింది. సో ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్రాన్స్ ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version