బోథ్‌ గులాబీలో రచ్చ..బాపురావుకు ఓటమి తప్పదా!

-

తెలంగాణలో ఒక నియోజకవర్గంలో కాదు దాదాపు 30-40 స్థానాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతల మధ్య పంచాయితీ తీవ్ర స్థాయిలో ఉంది. సీటు గురించి ఇంకా రచ్చ నడుస్తోంది. ఎవరికి వారు సీటు దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

ఇదే క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ స్థానంలో పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వ్యతిరేకంగా కొందరు కీలక నేతలు పావులు కదుపుతున్నారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి రాథోడ్ బాపురావు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి ఆయనకు కాస్త వ్యతిరేకత ఉంది. ఇదే క్రమంలో సొంత పార్టీలో కొందరు నేతలు బాపురావుకు వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా ఆత్మీయ సమ్మేళనంలో ఆ రచ్చ బయటపడింది.     తాజాగా ఎమ్మెల్యే బాపురావు సమ్మేళనం నిర్వహించగా, దానికి పోటీగా ఎంపీపీ తుల శ్రీనివాస్ సమ్మేళనం నిర్వహించారు.

అలా బోథ్ లో గ్రూపు రాజకీయం నడుస్తోంది. అటు మాజీ ఎంపీ నగేష్ సైతం సెపరేట్ గా గ్రూపుగా ఉన్నారు. గతంలో ఈయన టీడీపీ నుంచి బోథ్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చి 2014లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.

అయితే ఈ సారి ఆయన బోథ్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే బాపురావుకు సొంత పోరు పెరిగింది. అటు కాంగ్రెస్, బి‌జే‌పిలు బోథ్ లో  బలపడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాపురావుకు రిస్క్ పెరిగింది. అసలు ఈయన మళ్ళీ నిలబడితే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. ఏదేమైనా ఈ సారి బోథ్ లో బాపురావు గెలుపు డౌటే.

Read more RELATED
Recommended to you

Exit mobile version