ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రాజ్యాంగ స్పూర్తితో ఏర్పడిందే ఎన్నికల సంఘం అని ఎన్నికల కమీషనర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే మా బాధ్యత అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు వస్తే మేము పాటిస్తాం అని ఆయన అన్నారు.
మధ్యాహ్నం సిఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం హైకోర్ట్ లో తన వాదనలను బలంగా వినిపించింది అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అన్ని వర్గాలు సహకరించాలని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కూడా హైకోర్ట్ లో ఎన్నికలు జరపాలి అని తన వాదనలను వినిపించింది అని అన్నారు. సిఎస్, డీజీపీ ఇద్దరు పరిణితి చెందిన అధికారులు అని స్పష్టం చేసారు.
వారితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. విజయనగరం ప్రకాశం జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు లేవు అని అన్నారు. ఉదయం 6;30 నుంచి మధ్యాహ్నం 3;30 వరకు ఎన్నికల నిర్వహన్ ఉంటుందని అన్నారు. పంచాయితీ రాజ్ శాఖ అధికారులు మెరుగైన పని తీరు కనబరచాల్సి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని స్పష్టం చేసారు.