బ్రేకింగ్; టీడీపీ బయటపెట్టిన, వైసీపీ వాట్సాప్ చాట్…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని విశాఖ విమానాశ్రయంలోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీకి పోలీసులు సహకరించడం కూడా వివాదాస్పదంగా మారింది. అటు టీడీపీ నేతలతో పాటుగా అన్ని పార్టీల నేతలు దీనిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కావాలి అనే అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే కొందరి పేర్లను విపక్ష టీడీపీ బయటపెడుతూ ఆరోపణలు చేస్తూ వస్తుంది. తాజాగా ఒక వాట్సాప్ చాటింగ్ ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బయటపెట్టారు. డియర్ ఆల్, రేపు ఉదయం 8;30 కి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన వేపగుంట నుంచి విమానాశ్రయానికి మన సభ్యులను దగ్గర ఉండి పంపించాలి. కావున మీ లోకల్ వైసీపీ నాయకులతో ఫాలో అవ్వాలి. రవాణా ఆహారం ఖర్చులు అన్ని వాళ్ళే చూసుకుంటారు.

ఇప్పుడే అన్ని సంఘాలకు సమాచారం ఇవ్వండి. మీరే స్వయంగా shg లీడర్స్ ఇంటికి వెళ్లి మాట్లాడండి. మీ వివోలో ఉన్న అందరు సభ్యులు బయల్దేరాలి. సీసీలు ప్రతీ ఒక వివో కి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పండి. ఎక్కడ అయినా ప్రాబ్లెం అయితే నా నోటీస్ లో పెట్టండి.” అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. దీనిని ఆయన బయటపెట్టారు. దీనితో ఇప్పుడు వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన ఫిర్యాదుని గవర్నర్ కి కూడా ఇచ్చారు టీడీపీ నేతలు. కావాలి అనే చంద్రబాబుని అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడిక్కడ ముందుగానే ప్లాన్ చేసుకుని అడ్డుకున్నారు అని టీడీపీ మండిపడుతుంది. రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచంద్ తో భేటీ అయిన విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు.. విమానాశ్రయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version