కమలం-గులాబీ పాత ‘పొత్తు’..కాంగ్రెస్‌కు మేలేనా?

-

రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది..అయితే ఎన్నికల్లో ఎవరి వ్యూహం విజయవంతమయ్యి..అధికారం సొంతమవుతుందో చెప్పలేం. ఇక రానున్న తెలంగాణ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తమ వ్యూహాలని రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు ఒకే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అది ఏంటంటే..మూడు పార్టీలు ఉండేసరికి ఓట్ల చీలిక ఉంటుందని చెప్పి..వాటిల్లో రెండు పార్టీలు ఒకటే అని మిగిలిన పార్టీ చెబుతుంది.

మొదట నుంచి కాంగ్రెస్..బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి ఒక్కటే అని..కే‌సి‌ఆర్-మోదీ రహస్య మిత్రులు అని కామెంట్ చేస్తుంది. ఇక బి‌జే‌పి ఏమో..బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక్కటే అని అంటుంది. ఇటు బి‌ఆర్‌ఎస్ సైతం…బి‌జే‌పి-కాంగ్రెస్ కలిపి కుట్రలు చేస్తున్నాయని అంటుంది. అయితే ఇందులో జనం ఎవరిని నమ్ముతారో అర్ధం కావడం లేదు. అలా అని ఏ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు. కాకపోతే ఇటీవల ప్రజల మధ్యలోకి బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్ పరోక్షంగా సహకరించుకుంటున్నాయా? అనే డౌట్ ప్రజల్లో వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల బి‌జే‌పి ఎంపీ లక్ష్మణ్, బి‌ఆర్‌ఎస్ మంత్రి కే‌టి‌ఆర్ మధ్య మాటల యుద్ధం ఆ అంశాన్ని బలపడేలా చేస్తుంది.

అది ఏంటంటే 2018 ఎన్నికల్లో బి‌జేపి-బి‌ఆర్‌ఎస్ పొత్తుకు సంబంధించి చర్చలు జరిగాయని గతంలో లక్ష్మణ్ చేసిన కామెంట్లు ఇప్ప్ఉడు బయటకొచ్చాయి. దీంతో మొదట బి‌జే‌పినే..బి‌ఆర్‌ఎస్ తో పొత్తుకు ముందుకొచ్చిందని కే‌టి‌ఆర్ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. కే‌టి‌ఆర్ చెప్పేది అబద్దమని, కల్వకుంట్ల ఫ్యామిలీ అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయిందని, బి‌జే‌పి తో కలవాలని బి‌ఆర్‌ఎస్ ముందుకొచ్చిందని లక్ష్మణ్ చెబుతున్నారు.

మధ్యలో కాంగ్రెస్ వచ్చి..తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నాంగా…బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్ తోడు దొంగలు అని అంటుంది. ఈ అంశమే ప్రజల్లో చర్చకు వస్తుంది. ఒకవేళ అది నిజమని ప్రజలు భావిస్తే..బి‌ఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బి‌జే‌పికి వేసినట్లే అని అనుకుంటే..కాంగ్రెస్ కు మేలు జరుగుతుంది. అలా కాకుండా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి ఒక గేమ్ ప్లాన్ చేస్తే..కాంగ్రెస్ బలి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version