కవిత కోసం కారు డైవర్షన్ గేమ్..బండికి నో డ్యామేజ్!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో కవిత కూడా ఉన్నారనే కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ దాదాపు 9 గంటల పాటు కవితని విచారించిన ఈడీ..అరెస్ట్ చేయలేదు. విచారణ అయ్యాక ఆమె బయటకొచ్చేశారు. అయితే మార్చి 16న మరొకసారి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీలో కవిత విచారణ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ నేతలంతా అక్కడే మకాం వేశారు. పెద్ద ఎత్తున బి‌ఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో బి‌ఆర్‌ఎస్ ఊహించని ఒక పోలిటికల్ గేమ్ ప్లాన్ చేసింది. కవిత ఈడీ విచారణని డైవర్ట్ చేయడానికి బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేశారు. ఓ నాలుగు రోజుల క్రితం కవితని ఈడీ విచారణకు పిలవడంపై బండి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులని అరెస్ట్ చేయకపోతే ముద్దుపెట్టుకుంటారా? అని చెప్పి బండి..కవిత ఈడీ విచారణపై కామెంట్ చేశారు.

అయితే ఈ కామెంట్ నాలుగు రోజుల క్రితమే చేశారు. కానీ అప్పుడు బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేయలేదు. కరెక్టుగా కవితని ఈడీ విచారిస్తున్న సమయంలోనే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. బండి దిష్టిబొమ్మని తగలబెట్టడం చేశారు. ఇలా చేయడం పూర్తిగా డైవర్షన్ గేమ్ అని జనాలకు అర్ధమైపోయింది. అందుకే బి‌ఆర్‌ఎస్ ఆందోళనలు చేసిన పెద్దగా హైలైట్ కాలేదు.

కేవలం రాజకీయం కోసమే ఆందోళనలు చేశారని తెలిసింది. దీనిని  బండి సంజయ్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఆయనకు జరిగిన డ్యామేజ్ కూడా ఏమి లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version