బీఆర్ఎస్ తొలి జాబితా రెడీ..సీట్లు ఎవరికంటే?

-

మూడోసారి కూడా అధికారం దక్కించుకోవడానికి కే‌సి‌ఆర్ గెలుపు గుర్రాలని రెడీ చేస్తున్నారు. ఈ సారి గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం కే‌సి‌ఆర్ ఎలాంటి సంచలన నిర్ణయాలైన తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గెలుపు కోసం కొందరు నేతలు సీట్లు త్యాగం చేయక తప్పదు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి గెలిచి గట్టెక్కడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అంత ఈజీ కాదు. ఈ సారి గెలుపు కోసం గట్టిగా కష్టపడాలి.

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బి‌జే‌పిలు సైతం గట్టి పోటీ ఇస్తున్నాయి. మళ్ళీ ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి కే‌సి‌ఆర్ కసరత్తులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే కాదు..సొంత పార్టీని సైతం బలోపేతం చేసుకుని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి సీట్లు ఇచ్చే విషయంలో కే‌సి‌ఆర్ చాలా ఆచి తూచి ముందుకెళుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. అలాంటి వారిని ఈ సారి బరిలో దించకూడదని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు.

గెలిచే సత్తా ఉన్నవారినే బరిలో దించాలని చూస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కే‌సి‌ఆర్..అభ్యర్ధుల జాబితాని రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్ధులతో లిస్ట్ కూడా రెడీ చేశారని తెలిసింది. అది కూడా గెలిచే అవకాశాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని మొదట జాబితాలో విడుదల చేస్తారని తెలిసింది.

బి‌ఆర్‌ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. అందులో 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తూ మొదట జాబితాని జూలై నెలలో విడుదల చేసేందుకు కే‌సి‌ఆర్ ప్లాన్ చేశారని తెలిసింది. ఇక మిగిలిన 39 సీట్ల విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అందులో కొందరు సిట్టింగులని సైడ్ చేయనున్నారు. ఇక కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుంది కాబట్టి..వారికి కొన్ని సీట్లు కేటాయించవచ్చు. మొత్తానికి కే‌సి‌ఆర్..సీట్ల జాబితా విషయంలో సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version