ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఉన్న నేతలు అందరూ అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వ్యక్తిగత కారణాలు పార్టీలో విభేదాలు చూపుతూ పలువురు నేతల పార్టీకి గుడ్ బై చెబుతున్నారట. కెసిఆర్ పార్టీకి ఒకప్పుడు తిరుగులేని మెజార్టీని తీసుకొచ్చిన ఉమ్మడి వరంగల్ లో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది ..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంది.. దీంతో ఆ పార్టీలో బిఎస్ ఆర్ పార్టీ నుంచి నేతలు క్యూ కడుతున్నారు.. రన్ రాజా రన్ అంటూ కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నారు.. రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపే నేత్రలందరూ కాంగ్రెస్ లో చేరిపోయారు. గ్రామస్థాయిలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎంపీటీసీలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ నేతలనీ పార్టీలో చేర్చుకుందని ప్రచారం జరుగుతుంది..
మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు టచ్ లో ఉన్నారట. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆమెతోపాటు సుమారు 15 మంది కార్పొరేటర్ల సైతం హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.
వర్ధన్నపేట చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ల తో పాటు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కీలక నేత మాజీ మేయర్ ప్రకాష్ సైతం బిఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ బాట పట్టారు.. దీంతోపాటు మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీలో చర్చ నడుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ వశం అవుతుందని టిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు