బీఆర్ఎస్ లో ఫ్రీడమ్ లేదా.. అందుకే వెళ్లిపోతున్నారా…!

-

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది.పదేళ్ల పాటు అధికారం అనుభవించిన ఆ పార్టీకి ఆ ఫలితాలు షాక్ కి గురిచేసాయి.ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు.వారందరూ కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఫలితమో లేక ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ జరగదన్న ఆందోళనతోనే ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వదిలి వెళ్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే కేసీఆర్ పార్టీలో అసలు ఫ్రీడమ్ లేదని అందుకే బీఆర్ఎస్ ని వదిలి వెళ్తున్నామని చెప్తున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు.రోజురోజుకీ ఈ మాటకు బలం పెరుగుతోంది.కేసీఆర్ కూడా మౌనంగా ఉండటంతో విశ్లేషకులు కీడ అదే నిజమనుకుంటున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆర్థికపరమైన అంశాలు ఒక కారణం.కానీ మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని అంటున్నారు. అదే కేసీఆర్,కేటీఆర్ ల ఆధిపత్య ధోరణి.తండ్రి కొడుకుల మధ్య నలిగిపోతున్నామని మరికొందరు అంటున్నారు.ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విధివిధానాలపై కుండబద్దలు కొడుతున్నారు. పార్టీలో ఫ్రీడం అసలు ఉండదని.. ఎమ్మెల్యేలను పురుగులా ట్రీట్ చేస్తారని కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటివాళ్ళు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.అందుకే పార్టీ మారొద్దని కేటీఆర్ తో సహా కేసీఆర్ కోరినా పట్టించుకోవడం లేదు. గతంలో కేటీఆర్ ప్రదర్శించిన ఆటిట్యూడ్ ను ఎమ్మెల్యేలు ఆయనకు రుచి చూపిస్తున్నారు. చెప్పినా వినకపోవడం, ఏదైనా చెప్తే తలాడించడం చేస్తూ తాము చేయాల్సిన పనులను చేస్తూ బీఆర్ఎస్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు.

ఎమ్మెల్యేలు పార్టీ చేజారకుండా ఉండాలంటే కేటీఆర్, కేసీఆర్ అహంభావం తగ్గించుకోవాలని ఎమ్మెల్యేల భావన.ఇదే సమయంలో బీఆర్ఎస్ లో లభించని భావ ప్రకటన స్వేఛ్చ కాంగ్రెస్ లో ఉంటుందని అంటున్నారు. పనిలో పనిగా అధికార పార్టీలలో చేరితే ప్రజలకు పనులు చేసి పెట్టొచ్చని మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నారు. అధికార పార్టీలో లేకపోతే తమ వ్యాపారాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ గూటికి చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేల వాదనలూ వినిపిస్తున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు రావడం,క్యాడర్ ఒత్తిళ్ళు , నియోజకవర్గ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారని అంటున్నారు.ఎమ్మెల్యేల ఆరోపణలు నిజం కాబట్టే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నోరు మెదపడం లేదని విశ్లేషకులు చెపుతున్నారు.మరో 10 మంది ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే కారు దిగిపోనున్నారని సమాచారం

Read more RELATED
Recommended to you

Exit mobile version