హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్‌ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

-

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని.. నీళ్లు నిల్వ ఉండే 141 పాయింట్ల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బండి ఉండి నీళ్లను వెంటనే క్లియర్‌ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని చెప్పారు.

రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version