కారు వ్యూహం సీతక్క ఓటమి తప్పదా?

-

కాంగ్రెస్ లో తిరుగులేని నాయకురాలుగా సీతక్క పేరును చెప్పుకుంటారు. ఎప్పుడు ప్రజలలో ఉంటూ, వారి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్న నేత సీతక్క. ఈసారి ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క ఫిక్స్. సీతక్క పై ఎవరు పోటీ చేసిన గెలుపు మాత్రం సీతక్కదే అని రాజకీయ వర్గాలు అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం బిఆర్ఎస్ సీతక్కని ఓడించటానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా నాగజ్యోతిని ఫిక్స్ చేశారు.

ఇదే క్రమంలో మంగంపేట 23 రెవిన్యూ గ్రామాలు ఐదవ షెడ్యూల్ గ్రామాలే నంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ ఆయుధంగా ప్రయోగించనుంది. గిరిజనులకు అనుకూలంగా తీర్పురావడానికి సీతక్క కృషి చేసిందని గిరిజనేతరుల ముందు సీతక్కను నెగిటివ్ గా చూపించాలని బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. సీతక్క నాకు సంబంధం లేదు అని చెబితే గిరిజనుల ఎదుట సీతక్కను నెగిటివ్ గా చేయాలని ద్విముఖ వ్యూహం పన్నింది. బిఆర్ఎస్ సీతక్కకు పోటీగా గిరిజన మహిళని బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. తమ అభ్యర్థికి అందరూ అండగా నిలవాలని  సీతక్కను నియోజకవర్గ ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.

అయితే తెలంగాణ కాంగ్రెస్  రేవంత్ రెడ్డి రాకతో రెండు వర్గాలుగా విడిపోయింది. ఎప్పటినుండో కాంగ్రెస్ లో ఉన్న నేతలతో ఒక వర్గం, రేవంత్ రెడ్డి అనుచరులతో ఒక వర్గం వారు గా విడిపోయారు. సీతక్క రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరురాలీగా ఉన్నారు. అదే కారణం చూపిస్తూ పాత కాంగ్రెస్ వర్గం సీతక్కకు మద్దతును తెలపటం లేదు. కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలందరూ బిఆర్ఎస్ నేతలతో రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు ఆకర్ష బిఆర్ఎస్ లో భాగంగా, వీరందరికీ బీఆర్ఎస్ కండువా కప్పడానికి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా సీతక్క రంగంలోకి దిగి పరిస్తితులు చక్కదిద్దుకోకపోతే గెలుపు కష్టమవుతుందని సీతక్క అనుచరులు కంగారుపడుతున్నారు . హస్తం పార్టీలోని రెండు వర్గాలను ఒకటి చేసి తమ గెలుపుకు అనుకూలంగా మార్చుకోకపోతే సీతక్క భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version