చేవెళ్ళలో నువ్వా-నేనా..కారుని ఆపడం హస్తంకు కష్టమేనా?

-

చేవెళ్ళ పార్లమెంట్..కారు పార్టీకి కంచుకోట. 2008లో కొత్తగా ఏర్పడిన ఈ పార్లమెంట్ స్థానంలో 2009 ఎన్నికలు జరగగా, అప్పుడు కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే అప్పుడు 18 వేల ఓట్ల తో టి‌డి‌పిపై గెలిచారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, టి‌డి‌పిలు పోటీ పడ్డాయి. త్రిముఖ పోరులో బి‌ఆర్‌ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 73 వేల ఓట్ల తేడాతో ఆయన గెలిచారు.

ఇక తర్వాత కొండా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో కొండా కాంగ్రెస్ నుంచి,   రంజిత్ రెడ్డి బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు.  అయితే కేవలం 14 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో రంజిత్ రెడ్డి గెలిచారు. అటు బి‌జే‌పికి 2 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి పోరు జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. కొండా ఇప్పుడు బి‌జే‌పిలో ఉన్నారు. బి‌జే‌పి నుంచి బరిలో దిగితే ఆయన గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే చేవెళ్ళలో బి‌జే‌పికి అనుకున్న బలం లేదు. కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్‌లకు పట్టు ఎక్కువ. కాబట్టి కొండా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేస్తారా? లేదా ముందు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించిన పార్టీ చేవెళ్ళలో గెలవడం సులువు. అంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే పార్టీ..చేవెళ్ళ ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉంది. ఇక చేవెళ్ళ పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే వికారాబాద్, తాండూరు, పరిగి సీట్లలో బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇస్తుంది. కానీ టోటల్ గా బి‌ఆర్‌ఎస్‌కే ఆధిక్యం కనిపిస్తోంది. అసెంబ్లీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అదే జరిగితే చేవెళ్ళ ఎంపీ సీటు కూడా బి‌ఆర్‌ఎస్‌కే దక్కే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version