జగన్ పిటీషన్ కొట్టేసినా – పాజిటివ్ అయ్యింది..!!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాలంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనకు చాలా ఖర్చు అవుతుందని ప్రజాధనం వేస్ట్ అవుతుంది అలాగే సమయం కూడా వృధా అవుతుందని సిబిఐ కోర్టు కి విన్నవించగా అప్పట్లో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా గతంలో వేసిన జగన్ పిటిషన్ను కొట్టివేస్తూ..తాజాగా సిబిఐ ఎంక్వయిరీ కి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా వైయస్ జగన్ హాజరుకావాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ న్యూస్ హైలెట్ అయ్యింది.

దివంగత తండ్రి వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వైయస్ జగన్ విడిపోయిన తర్వాత ఆ సమయంలో కాంగ్రెస్ మరియు టిడిపిలు కలిసి వేసిన అక్రమ కేసుల్లో వైయస్ జగన్ దాదాపు 16 నెలలపాటు అన్యాయంగా జైల్లో ఉండటం జరిగింది. కొన్ని లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు అని అక్రమాస్తులు సంపాదించుకున్నారని జగన్ పై కేసులు వేసి ఇప్పటిదాకా సిబిఐ ఒక కేసును కూడా రుజువు చేయలేకపోయింది.

 

ఇదే క్రమంలో వైయస్ జగన్ ఎదుర్కొంటున్న సిబిఐ కేసులు అన్యాయం కేవలం సోనియా గాంధీకి ఎదురు తిరగడం వల్లే జగన్ కేసుల్లో ఇరుక్కున్నారు అని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ మీడియా సమావేశంలో పేర్కొనటం జరిగింది. ఇటువంటి తరుణంలో మళ్లీ వైయస్ జగన్ ని సిబిఐ చేత ఇబ్బందుల పాలు చేయడం వల్ల రోజుకి కోర్టుకు వెళ్లడం వల్ల ప్రతి శుక్రవారం విచారణ హాజరు కాలేనని జగన్ వేసిన పిటిషన్ను కొట్టి వేయటం వల్ల జగన్ కి భవిష్యత్తులో పాజిటివ్ ఉంటుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజంగా వైయస్ జగన్ తప్పు చేసి ఉంటే గతంలోనే కేంద్రంలో సోనియాగాంధీ ఉన్నప్పుడే ఆ కేసులు రుజువయ్యేవి లేకపోతే తర్వాత వచ్చిన చంద్రబాబు అయినా సరే రుజువు చేసే వాళ్ళు కేసుల్లో పస లేదు కాబట్టి జగన్ అంత ధైర్యంగా ఉన్నారు అని అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్టుకి వెళ్ళి వస్తూ ఉంటే సింపతీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version