కేంద్రంలో రెండోసారి వరుసగా వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2020-21 వార్షిక బ డ్జెట్‌తో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా మోడీ ప్రభుత్వం ఈ దఫా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. కనీసం ప్రాధాన్యాలు కూడా లేకుండా పోయా యి. ఈ పరిణామాంతో ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా వుంటే, కాం గ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలైతే.. బీజేపీని మరింతగా నిప్పులు చెరుగుతు న్నాయి. ఈ పరిణామంతో బీజేపీ తీవ్ర ఇరకాటంలో పడింది.
వాస్తవానికి ప్రస్తుతం మరో వారం రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అదేసమయంలో వచ్చే ఏ డాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్ , తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప్రవేశ పెట్టిన మోడీ బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలకు కూడా ఎక్కడా నిధులు కేటాయించలేదు. తమిళనాడు చెన్నై-బెంగ ళూరు ఎక్స్‌ప్రెస్ వే మాత్రమే ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఢిల్లీ ఊసు ఎక్కడా కనిపించలేదు.
దీంతో అ న్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క,పదేళ్ల పాటు పాలించి యూపీఏ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే.. బీజేపీ ఎక్కడా సామాన్యులను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ.. మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లింది. బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటరేమో..! అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక, ఏపీ విషయానికి వచ్చి నా ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై ఏపీలోనూ విమర్శలు వినిపిస్తు న్నాయి. ప్రత్యేక హోదా విషయాన్ని తేల్చకపోవడం, ప్యాకేజీగా ఇస్తానన్న నిధులను పక్కన పెట్టడం, అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకపోవడం, వెనుకబడిన జిల్లాలకునిధులు ఇవ్వకపోవడంపై ఏపీలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ప్రజలు ఏమనుకున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు కాబట్టి.. మరో నాలుగేళ్ల లోపైనా మోడీ తన విధానాలు మార్చుకుంటారేమో చూడాలి.