ముందుచూపు అనే పదానికి ఆయన పర్యాయపదం, అసాధ్యాలను సుసాధ్యం చేసే నేర్పరితనం, సంస్కరణల అమలులో దూకుడు, సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకునే సమరయోధుడు పాలనకు సాంకేతిక జోడించిన శ్రామికుడు. ఎదుటివారి ఆలోచించడం పై ఆలోచనలో పెట్టే కార్యదక్షుడు, ఏడుపదుల వయసులోనూ నేటి తరానికి సవాలు విసిరే సాహసికుడు ఆయనే టిడిపి అధినేత ఏపీ ప్రతిపక్ష నేత పట్టువదలని విక్రమార్కుడు నారా చంద్రబాబు నాయుడు. నేడు 70 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
యువతకి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా హైదరాబాద్ నగరంలో ఐటీ నెలకొల్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అమాంతం పెంచేశారు. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న నగరాలకంటే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక క్రేజ్ వుండేలా చంద్రబాబు పరిపాలించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకంగా రాణించడం జరిగింది. క్రమంగా తర్వాత ప్రభుత్వాలు మారటం రాష్ట్రం విడిపోవడం జరిగింది. విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు…రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎన్నుకొని స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలను సేకరించారు.
ఇదే టైములో విశాఖలో కూడా ఐటీ నగరం అభివృద్ధి చెందేందుకు తన పరిపాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో వీటిని వివాదాస్పదంగా చేసిందనుకోండి అది వేరే విషయం. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావటంతో 70 వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఎక్కడా కూడా టెంపర్ లూజు అవ్వకుండా ఓర్పుతో అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాలి అన్నదానికి తెలుగు వాళ్లకు ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇప్పటికీ కూడా తీసుకునే నిర్ణయాల విషయంలో సమస్యలను తీర్చే విషయంలో లో యువకుడిగానే వ్యవహరిస్తారు.