జూనియర్‌ కు బుచ్చయ్యతోనే బ్రేక్ వేస్తున్నారా?

-

ఎప్పుడైతే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి  ప్రతిపక్షానికి పరిమియతమైందో అప్పటినుంచి…టి‌డి‌పిలో జూనియర్ ఎన్టీఆర్ పేరు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక టి‌డి‌పి పని అయిపోయిందని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్న వేళ…కొందరు టి‌డి‌పి కార్యకర్తలు పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని, పార్టీని బ్రతికించాలని మాట్లాడుతున్నారు. అలాగే బహిరంగంగానే ఎన్టీఆర్ రావాలని నినాదాలు చేస్తున్నారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ

చంద్రబాబు, లోకేష్ సభల్లో సి‌ఎం ఎన్టీఆర్ అంటూ నినదిస్తున్నారు. అయితే ఈ పరిణామాలు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇదే సమయంలో పలువురు సీనియర్ నాయకులు కూడా ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ, ఎన్టీఆర్ పేరుని బహిరంగంగానే పలికారు. పార్టీని బలోపేతం చేయడం కోసం ఎన్టీఆర్ కృషి చేయాలని మాట్లాడారు.

దీంతో తన తనయుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడుప్పుడే లోకేష్ పికప్ అవ్వడంతో పార్టీలో జూనియర్ పేరు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా లోకేష్ రాజకీయాలు చేస్తున్నారు. అధికార వైసీపీపై దూకుడుగా వెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. గతంలో పప్పు అని విమర్శలు చేసిన నాయకులే ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌కు లోకేష్ నాయకత్వంపై నిదానంగా నమ్మకం పెరుగుతుంది.

అటు జూనియర్ పేరు తలుస్తున్న సీనియర్లని కూడా లోకేష్ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న బుచ్చయ్యని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. బుచ్చయ్య ఏం చెప్పిన చంద్రబాబు వింటున్నారు. ఆయన లేవనెత్తుతున్న అంశాలపై దృష్టి పెడుతున్నారు. ఇలా బుచ్చయ్య, జూనియర్ వైపుకు వెళ్లకుండా చంద్రబాబు, లోకేష్‌లు సెట్ చేసేశారు. ఏదేమైనా ఇకపై జూనియర్ పేరు వినపడకుండా చంద్రబాబు, లోకేష్‌లు ముందుకెళ్లెలా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version