వారి విషయంలో లైట్ తీసుకోవద్దు.. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం..

-

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. వైసీపీకి జరిగిన అనుభవాలను గుర్తెరిగి..వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యనేతలకు ఆదేశాలు జారీ చేశారట..దీంతో ఈ ఎన్నికలపై నేతలు ఆచితూచి అడుగులేస్తున్నారు.. రెండు స్థానాల్లో గెలిచి తీరేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు..

వైసీపీ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది.. అధికారం చేతిలో ఉండి కూడా ఓడిపోవడంతో.. టీడీపీలో జోష్ వచ్చింది.. అప్పటి నుంచి ఆ పార్టీ పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉభయగోదావరి, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి.. వీటిల్లో ఖచ్చితంగా గెలిచేలా సీఎం చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు..

ఈ ఎన్నికలపై ఇటీవల రాజమంత్రిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఈ ఎన్నికలపై భారీ కసరత్తే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యనేతలందరూ పలు సూచనలు చేశారట.. మొదటగా ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారట.. గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికలపై కూడా కూటమి గట్టిగానే ఫోకస్ పెట్టింది.. ఆర్దిక, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న కూటమి అభ్యర్దిగా మాజీ మంత్రి ఆలపాటి రాజాను బరిలోకి దింపింది.. ఖచ్చితంగా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.. గతంలో ఈస్థానం నుంచి చిగురుపాటి వరప్రసాద్ కు టీడీపీ మద్దతిచ్చింది.. తర్వాత జరిగిన రెండు దఫాలు వామపక్షాలే విజయం సాధించాయి.. ఈసారి ప్రత్యక్షంగానిలబడి గెలిచి తీరాలన్న కసితో టీడీపీలో బరిలోకి దిగుతోంది..

వైసీపీ హయాంలో మూడు పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరిగితే..ఒక్క చోట కూడా అధికార పార్టీ గెలవలేదు.. వైసీపీకి ఎదురైన అనుభవమే గుణపాఠంగా చేసుకుని.. తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని భావిస్తోంది. గుంటూరు గ్రాడ్యుయేట్ స్తానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా, వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి దాదాపుఖారారైంది.. పట్టభద్రులు ఎవరి వైపు ఉన్నారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version