తెల్లారితే.. ఇలా జ‌రుగుతుంద‌ని తెలిసి.. రాత్రికిరాత్రి బాబు భారీ స్కెచ్‌..!

-

రెండో సారి కూడా త‌న‌కే ద‌క్కాల్సిన అధికారం ద‌క్క‌క పోయేస‌రికి తీవ్ర ఆవేద‌న‌లో ఉన్న టీడీపీ అధినేత‌.. త‌న ఆక్రోశాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియ‌క‌.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని ఎలాగైనా డీ గ్రేడ్ చేసేందుకు యోచిస్తు న్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా టైం చూసుకుని జ‌గ‌న్ ప్ర‌భు త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. అది కూడా కేవ‌లం విమ‌ర్శించాల‌నే ఉద్దేశంతోనే త‌ప్ప దా నిలో ఎలాంటి ప‌సా ఉండ‌డం లేద‌నేది ఆయ‌న‌కు కూడా తెలిసిన విష‌య‌మేన‌ని అంటున్నారు. తాజాగా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఇది ర‌ద్దుల ప్ర‌భుత్వ‌మ‌ని, కూల్చ‌డం, మార్చ‌డం త‌ప్ప ఇంకేమీ తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు.

అదేస‌మయంలో తాను గ‌తంలో క‌ష్ట‌ప‌డి తెచ్చిన కంపెనీల‌ను వెళ్ల గొడుతున్నార‌ని జ‌గ‌న్‌పై అక్క‌సు వెళ్ల‌గ క్కారు. అక్కడితో ఆగ‌ని బాబు.. ‘‘తొమ్మిది నెలల్లోనే కనీవినీ ఎరుగని ఆర్థిక పతనం చోటు చేసుకొంది. మూర్ఖత్వం, మొండితనం, కక్ష సాధింపు తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలు కనిపించ డం లేదు. రాష్ట్రం నుంచి బయటకు పారిపోయేవారే తప్ప రాష్ట్రానికి వచ్చేవారు లేరు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదు. ఒక ఉన్మాది పాలకుడైతే జరిగే విధ్వంసం ప్రతి అడుగులో కనిపిస్తోంది. ఈ రాష్ట్రం ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో వ్యాపిస్తోంది’’ అని తీవ్ర ఆవేద‌న వ్య‌క్త చేస్తూ.. దాదాపు క‌న్నీరు పెట్టుకున్నంత ప‌ని చేశారు.

అయితే, వాస్త‌వం ఏంటంటే.. చంద్ర‌బాబు ఆవేద‌న అంతా కూడా ప‌క్కా`స్కెచ్‌` అంటున్నారు విమ‌ర్శ‌కు లు. ప్ర‌బుత్వం ఏదైనా కీల‌క ప‌థ‌కాన్నో.. ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో అమ‌లు చేసిన‌ప్పుడ‌ల్లా కూడా చంద్ర బాబు ఇలాంటి వ్యూహాల‌ను, స్కెచ్‌ల‌నే అమ‌లు చేస్తున్నారు. ఆయా కార్య‌క్ర‌మాల‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేయ‌డం, వాటిపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చూడ‌డం బాబు ల‌క్ష్యం. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతోంద‌నే వికృత ప్ర‌చారం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు త‌న ఆత్మ‌ను సంతృప్తి ప‌రుచుకుంటు న్నార‌నే ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కీల‌క కార్య‌క్ర‌మాల రోజే.. చంద్ర‌బాబు ఆందోళ‌న‌ల‌కు దిగుతారు.. లేదా గంట‌ల త‌ర‌బడి ప్రెస్‌మీట్లు పెట్టి జ‌గ‌న్‌ను ఏకేస్తారు. సో.. ఇదంతా కూడా వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న విన్యాస‌మంటున్నారు ప‌రిశీల‌కులు.

+ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కింద నిధులు పంపిణీ చేసింది. ఆ రోజు ఈ కార్య‌క్ర‌మం ఎక్క‌డ ప్ర‌చారంలోకి వ‌స్తుందోన‌ని భావించిన చంద్ర‌బాబు అదే రోజు రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించారు.

+ అమ్మ ఒడి కార్య‌క్ర‌మం నిధులు గ‌త నెల 9న బ్యాంకుల్లో ప‌డ్డాయి. ఇది అత్యంత కీల‌క‌మైన ప‌థ‌కం. అయితే, అదేరోజు.. చంద్ర‌బాబు తొలిసారి తాను జోలె ప‌డుతున్నానంటూ.. రాజ‌ధాని ఉద్య‌మానికి నిధులు సేక‌ర‌ణ ప్రారంభించారు.

+ తాజాగా వృద్ధులు, అర్హులైన వారికి పింఛ‌న్ల‌ను ఇంటింటికీ చేర్చే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రుగు తోంది. అదేస‌మ‌యంలో రాజధాని భూముల‌పై ఈడీ కేసులు న‌మోదు చేసింది. అదేవిధంగా ఐటీ అధికారులు కూడా కేసుల న‌మోదుకు రెడీ అయ్యారు. ఈ రెండు విష‌యాలు తెర‌మీదికి వ‌స్తాయ‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు వీటిని అనూహ్యంగా ప‌క్క‌కు త‌ప్పించి, త‌న‌కు ప్రాధాన్యం పెంచుకునేలా నిన్న‌నిటికి నిన్న అనూహ్యంగా మీడియా ముందుకు వ‌చ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధించారు.
అయితే, బాబు ఎన్ని స్కెచ్‌లు వేసినా.. ప్ర‌జ‌లు అమాయ‌కులు కార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version