ఆ న‌లుగురు ఒక్క‌టై టిడిపిని టార్గెట్ చేశారు : చంద్ర‌బాబు

-

  • కేటీఆర్ ప‌వ‌న్ కు ఫోన్ చేయ‌డం ఏంటి?

అమ‌రావ‌తి : బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త‌ప్పుప‌ట్టారు. మంత్రుల‌తో నిర్వ‌హించిన టెలికాన్ఫ‌రెన్స్ లో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆ నాలుగు పార్టీలు టీడీపీనే టార్గెట్ చేశాయన్నారు. తితలీతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క బీజేపీ నేత పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. పైగా పక్క రాష్ట్రం తాజా మాజీ మంత్రి కేటీఆర్.. పవన్‌కల్యాణ్‌ను అభినందించడాన్ని ఆక్షేపించారు. రాజమండ్రిలో కవాతు బాగా జరిగిందని కేటీఆర్ ఫోన్ చేసి ప్రశంసించారు. తితలీ తుఫానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదన్నారు చంద్ర‌బాబు. ప‌వ‌న్‌, వైసీపీ, టిఆర్ ఎస్ అంతా క‌లిసి పని చేస్తున్నారని చెప్పడానికి ఇవే రుజువులు అని చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు.

జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన కరవైందన్నారు. జ‌గ‌న్‌ ఫ్యాక్షన్ మనస్తత్వామే దీనికి కారణమని వెల్లడించారు. జగన్ చిత్తుశుద్ధితో పాదయాత్ర చేయడం లేదని, డ్రామాగా పాదయాత్ర చేస్తున్నాడని విమర్శించారు. జగన్ ఇలానే మరో నాలుగేళ్లు నడిచినా అతనికి ఫలితం దక్కదని జోస్యం చెప్పారు. దేనికైనా విజన్, ఎగ్జిక్యూషన్ ఉంటేనే ఫలితాలొస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీలు టీడీపీనే టార్గెట్ చేయ‌డం వ‌ల్ల తెలుగుదేశానికే లాభమని వెల్ల‌డించారు. వాళ్లే తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలన్నారు. ప్రజాభిమానమే తెలుగుదేశానికి నైతిక బలంగా అభివర్ణించారు. ఇందుకోసం తానొక్కడినే కష్టపడితో కుదరదని, పార్టీ మొత్తం కష్టపడితే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి బాగా పెరుగుతుందని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version